కార్ఖానా నూతన పోలీస్ స్టేషన్ భవనం పనులను పరిశీలించారు మంత్రి హరీశ్ రావు. గురువారం కార్ణానాలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హరీశ్ రావు…నూతన భవన నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ ప్రహారికి సంబంధించి నిధులు లేకపోవడంతో నూతన భవనంలోకి రాలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో భవన నిర్మాణానికి సంబంధించిన నివేదికను తయారు చేసి పంపాలని కావాల్సిన నిధులను రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ సభ్యుడు ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావు సందర్శించిన అనంతరం తెలంగాణ పోలీస్ హౌజింగ్ అధికారులు కార్ఖానాకు పరుగులు పెట్టారు. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జైన్, చీఫ్ ఇంజినీర్ విజయ్‌కుమార్, ఈఈ విజయేందర్‌రెడ్డిలు భవనాన్ని పరిశీలించారు.