బిగ్ బాస్ ఎపిసోడ్ 60లో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల కోసం “పల్లెకు పోదాం ఛలో ఛలో” అనే టాస్కు ఇచ్చాడు. ఈ టాస్కులో ప్రధానంగా మండే మంటను ఆరకుండా చూడటం, గ్రామపెద్దగా సోహైల్, అతడి భార్యగా లాస్య, కూతురిగా అరియానా ఉంటారని తెలిపాడు. ఇక గ్రామంలో పుకార్లు పుట్టించే పాత్రను హారికకు ఇచ్చిన బిగ్ బాస్…పాన్ యజమాని తమ్ముడు మీ ప్రియుడు అని మీరు గ్రామంలో మూడు హత్యలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు.
రాజశేఖర్‌పై కాఫీ చల్లడం, అవినాష్‌కు కోపం తెప్పించి అరిచేలా చేయడం, చంపాలనుకునే వ్యక్తి పేరు లిప్‌స్టిక్‌తో కిటికీ మీద రాయడం వంటి మూడు హత్యలు హారిక చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే మాస్టర్ మీద కాఫీ పోస్తే రచ్చ రచ్చ జరుగుతుందని అంతా భావించారు.
కానీ హారిక చాలా తెలివిగా ముందే కాఫీ కలిపి పెట్టుకుని ఛాన్స్ కోసం ఎదురుచూస్తు మాస్టర్‌పై కాఫీ పోసేసి చాలా బాగా కవర్ చేసేసింది. మాస్టర్ ఇది టాస్క్‌లో భాగమే అనుకుంటా అని తెలిపినా తెలియకుండా జరిగిందని కవర్ చేసిన హారిక బిగ్ బాస్ కెమెరా ముందుకెళ్లి తొలి హత్య చేశానని తెలిపింది.