- Advertisement -
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 12.74 శాతం పోలింగ్ నమోదు కాగా దుబ్బాక మండలం తన సొంత గ్రామము పోతారం లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లచ్చపేటలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతీ హొళికెరి పరిశీలించారు. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం నివేదికను పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 104 పోలింగ్ కేంద్రాలను పోలింగ్ తీరును పరిశీలించారు.
- Advertisement -