పొలిటిషియన్స్‌కు నోరు జారడం కొత్తేమీ కాదు. ఎందుకంటే రాత్రికి రాత్రే…గంటకు గంటకే పార్టీలు మారుస్తున్న నేతలు తాము ఏ పార్టీలో ఉన్నామో తెలియక పాత పార్టీలకే ఓటువేయాలని నోరుజారిన సందర్భాలు అనేకం.తాజాగా అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన జ్యోతిరాదిత్య సింథియా తన అనుచర ఎమ్మెల్యేలు 22 మందితో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
సింథియా వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు అనివార్యంకాగా గ్వాలియర్‌లోని దబ్రా టౌన్లో బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సింథియా…బీజేపీకి ఓటేయాలని అనాల్సింది పోయి ..పొరపాటున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు.
దీంతో స్ధానికంగా ఉన్నవారు అవాక్కుకాగా పక్కనే ఉన్న నేతలు అప్రమత్తం చేయడంతో వెంటనే నాలుకకరుచుకుని బీజేపీకి ఓటేయాలని కోరారు. సింథియా నోరు జారీన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్…సింథియాజీ మీరు చెప్పినట్టే ప్రజలు హస్తానికి ఓటెస్టారు అని ట్వీట్ చేసింది.