బంజారా జాతి ఆరాధ్య గురువు శ్రీ శ్రీ రామ్ రావు మహరాజ్ ముంబై లో ప్రయివేట్ ఆసుపత్రిలో శ్వాస కొస అనారోగ్యం తో చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచారు.భారత దేశం లో ఉన్న బంజారా ST లంబాడా కులస్తులు ఆరాధ్య గురువు అతని మాటే వేదం ,అతని మాటలను లంబాడా ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తూ బంజారా సమాజం ముందుకు సాగుతుంది.
రామారావు మహరాజ్ ఇక లేరని తెలిసి యావత్ బంజారా సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. భవాని మాత ఆశీస్సులు రామారావు మహరాజ్ కి ఉండడంతో మహరాజ్ యొక్క శక్తి ఆమోగమైనది.దేశ ప్రధాన మంత్రులు సైతం మహరాజ్ యొక్క ఆశీస్సులు పొందినారంటే ఆ మహానుబావుని మహిమలో ఏపాటివో అర్ధమవుతుంది.రామారావు మహరాజ్ యొక్క స్వస్థలం మహారాష్ట్రలోని యోత్మల్ జిల్లాలో గలా పౌరగడ్ ప్రాంతం ఆ ప్రాంతం బంజారుల పుణ్యక్షేత్రం ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో బంజారుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ సమాధి అయి వెలసిన పుణ్యక్షేత్రం.మహరాజ్ యొక్క అంత్యక్రియలు రేపు ఆదివారం నాడు మహారాష్ట్రలోని పౌరగడ్ లో నిర్వహిస్తారు.