బంజారాలను జాగృతం చేసిన రామ్ రావు మహరాజ్‌:హరీశ్ రావు

54
Minister Harish Rao

బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ. తపస్వి. పౌరా దేవి పీఠాధిపతి రామ్ రావు మహరాజ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. యావత్ భారత దేశంలోని బంజారాలను జాగృతం చేసిన వ్యక్తి రామ్ రావు మహరాజ్.

ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి బంజారాలలో మార్పు తీసుకువచ్చిన ఆదర్శప్రాయుడు రామ్ రావు మహరాజ్ అని కొనియాడారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా….సంత్ శ్రీ రామ్ రావు మహరాజ్ ఆశయాలకు అనుగుణంగా నడవడమే ఆయనకు మనమర్పించే ఘనమైన నివాళి అన్నారు హరీశ్ రావు.