గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి హరిత..

391
Haritha
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి హరిత మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని నటి హరిత తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

సినీ నటి శృతి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఈరోజు మణికొండలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు సినీ నటి హరిత. అనంతరం మరో ముగ్గురు ( ఆర్టిస్ట్ లు జాకీ,సాండ్రా,అమృత ప్రిన్సి ) లు కూడా మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని ఆమె కోరారు.

- Advertisement -