మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్‌..

215
ktr
- Advertisement -

తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో మారు తన మంచి మనస్సును చాటుకున్నారు. అయిన వాళ్లని కోల్పోయి అనాథలుగా మారిన ఆడపిల్లలకు పెద్దన్నగా నేనున్నానంటూ భరోసానిచ్చారు. అనాథలైన అక్కాచెల్లెళ్ల దీనస్థితిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వారి బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆడ పిల్లల సంరక్షణ బాధ్యత తమదేనని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పోంగి ప్రవహించింది. వాగు దాటుతూ పెందోటి లక్షమ్మ అనే మహిళ ప్రవాహ ఉధృతికి తాళలేక వాగులో పడి చనిపోయింది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త నర్సింహా మూడు రోజుల వ్యవధిలోనే ఉరేసుకుని చనిపోయాడు. స్వల్ప వ్యవధిలో ఇరువురి మృతి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన అక్కాచెల్లెళ్ల దీనస్థితి వివరిస్తూ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆదుకోవాల్సిందిగా కోరారు. స్పందించిన మంత్రి పిల్లల సంరక్షణ బాధ్యతలు చూడాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను మంత్రి కోరారు.

- Advertisement -