- Advertisement -
జాకట రమేష్ దర్శకత్వంలో నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘సారథి’. నరేష్‌యాదవ్, వై.ఎస్. కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చాలాకాలం తర్వాత తారక్ ఫుల్ లెంగ్త్ రోల్లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రీడానేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. తారకరత్న పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు.టైటిల్‌కు చక్కటి స్పందన లభిస్తోందన్నారు. కథాబలమున్న మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించారు. ఆ కోవలోనే మా సినిమా నిలుస్తుందనే నమ్మకముంది. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తామన్నారు.
- Advertisement -