బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి తలసాని

235
talasani
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని..బీజేపీ నాయకులు చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్ధితిలో లేరన్నారు.

సిద్దిపేటలో బీజేపీ వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మీడియాలో ప్రచారం కోసమే బీజేపీ హడావుడి చేసిందన్నారు. నిన్న జరిగిన ఘటనపై వీడియో విడుదల చేయకపోయి ఉంటే ప్రజల్లో అనుమానాలు వచ్చేవని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి దోహదం చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -