బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 50 హైలైట్స్

288
samantha
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 50వ ఎపిసోడ్‌లో భాగంగా దివి ఇంటి నుండి బయటికి రాగా అఖిల్…మోనాల్ కోసం కన్నీళ్లు పెట్టుకోవడం,సమంత ఒక్కో సభ్యుడి గురించి చెప్పి అందరిని ఆకట్టుకోవడం హైలైట్‌గా నిలిచాయి.

నాగార్జున సినిమా షూటింగ్‌కి వెళ్లడంతో ఆయన ప్లేస్‌లో బిగ్ బాస్ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సమంత. కులుమనాలి నుంచి ప్రేక్షకులతో మాట్లాడిన నాగార్జున.. అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.. ఈ విజయ దశమి రోజున మిమ్మల్ని అందర్నీ, బిగ్ బాస్ హౌస్‌ని మిస్ అవుతున్నా నా బాధ్యతలను సమంతకి అప్పచెబుతున్నా అని స్పెషల్ వీడియో షేర్ చేశారు. తర్వాత ఎంత సక్కగున్నావే సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది సమంత.

ఇంటి సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సమంత….ఈరోజు నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు.. నేను మీ అందరి గురించి బాగా చదివాను.. మీ గురించి రెండు రెండు మాటలు చెప్తా అని.. Aతో మొదలుపెడతా అంటూ తొలుత అరియానా గురించి చెబుతు అరియానా అంటే ఫైటర్‌..నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని తెలిపింది.

దివి ……. గురి చేస్తే తప్పుదు.. ఎప్పుడు ఎటు ఫోకస్ చేస్తుందో ఎవరికీ తెలియదని తెలపగా దేత్తడి హారిక గురించి మాట్లాడుతూ బాగా క్లారిటీ ఉంది కానీ బిగ్ బాస్ అన్ ఫెయిర్ అని ఎందుకు అన్నావ్ అంటూ పంచ్‌లిచ్చింది. ఇక లాస్య గురించి చెబుతూ నవ్వుతూనే అందర్నీ బుట్టలో పడేస్తుంది.. అవార్డ్ విన్నింగ్ స్మైలా నీది?. కానీ నీది కన్నింగ్ స్మైల్ అంటుటారే అని లాస్య‌కి పంచ్ వేసింది సమంత.

మోనాల్ 7 వారాల్లో తెలుగు చాలా బాగా నేర్చుకుంది.. బిగ్ బాస్ హౌస్‌లో చాలా మందికి చాలా నేర్పుతుంది.చాలామందికి ప్రేమ పంచుతుందన్నారు.అబ్బాయిల బలహీనతల గురించి వారే చెప్పాలని కోరగా ఇస్మార్ట్ సొహైల్.. నా గురించి చెప్పాలంటే ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడ నేను ఉంటా.. వీక్ నెస్ వచ్చేసి కోపం వస్తే నరాలు తేలుతాయన్నారు. ఈ ప్రపంచంలోనే మీది బ్యూటిఫుల్ స్మైల్.. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెప్తాం అనుకున్నా అని అభిజిత్ పులి హోర కలిపే ప్రయత్నం చేయగా హౌస్‌లో అందర్నీ ఇంప్రెస్ చేస్తున్నావ్.. నన్ను కూడానా.. అంటూ పంచ్ ఇచ్చింది సమంత.తన వీక్ నెస్ అంటే కోపం అని చెప్పాడు అవినాష్.

తన ముందు ఎంత నెగిటివ్ జరుగుతున్నా పాజిటివ్‌గా తీసుకుంటా అని చెప్పాడు నోయల్. దాన్ని బలం అంటారా? అని సెటైర్ వేసింది సమంత. ప్రేక్షకులే నా బలం అని అవినాష్ తెలపగా పంచ్‌లు వేస్తే ఫ్యాన్స్‌కి చెప్తా అని నవ్వుతూ హెచ్చరించారు సమంత. నా బలం నా భార్య, పిల్లలు. నా బలహీనత సెంటిమెంట్, కోపం అని చెప్పారు అమ్మ రాజశేఖర్. నా బలం నా ఫిజికల్ ఫిట్ నెస్. ఓపిక ఎక్కువ అని మెహబూబ్ తెలపగా ఏంటి అఖిల్ డ్రెస్ బావుంది..గుజరాతీనా అని పంచ్ వేశారు సమంత. తనకు ఓపిక చాలా ఎక్కువని అయితే ఎవరైనా అబద్ధం ఆడితే అస్సలు నచ్చదు.. కోపం వచ్చేస్తుందని చెప్పాడు అఖిల్.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అఖిల్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి సమంతతో కలిసి సర్ ప్రైజ్ చేశాడు. పనిలో పనితో తన అప్ కమింగ్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. ఇక కీలకమైన నామినేషన్స్ విషయానికి వస్తే తొలుత సేవ్ అయింది అరియానా. నోయల్,అభిజిత్‌లు, అవినాష్, దివిలు మిగలగా దివి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది సమంత.ఎలిమినేషన్ తరువాత చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది దివి.

ఇక బిగ్ బాంబ్‌ని లాస్యపై విసిరింది. వారం రోజుల పాటు ఒక వ్యక్తి మాత్రమే వంట చేయాలి.. ఒక అసిస్టెంట్ మాత్రమే ఉంటారని తెలిపింది. తనకు కార్తీకేయ సినిమాలో ఛాన్స్ ఇప్పించాలని కోరగా మొత్తానికి సమంత కోరికపై తన సినిమాలో దివికి ఛాన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కార్తీకేయ.తర్వాత విజయదశమి స్పెషల్ ఎపిసోడ్‌కి గుడ్ బై చెప్పేసింది సమంత.

- Advertisement -