దివి ఎలిమినేట్…లాస్యపై బిగ్ బాంబ్

88
divi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ఏడవ వారం పండుగ సందర్భంగా ఎలిమినేషన్ ఉండదని అంతా భావించారు కానీ ఈ వారం కూడా ఎలిమినేషన్ ఉంచుతూ సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఎలిమినేషన్‌లో ఉన్న ఆరుగురిలో ఓటింగ్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉన్న దివి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు సమంత.

ఎలిమినేట్ అయిన తర్వాత నవ్వుతూ….నవ్విస్తూ బయటకు వచ్చేసింది. పండుగ రోజు వెళ్తున్నా.. ప్రాబ్లమ్ లేదు.. బయట ఎవరు ఏం అనుకున్నా.. నాకు అమ్మా రాజశేఖర్ అమ్మాలాగే తన ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ పేర్కొంది.

తర్వాత లాస్యపై బిగ్ బాంబ్‌ని విసిరింది దివి. వారం రోజుల పాటు ఒక వ్యక్తి మాత్రమే వంట చేయాలి.. ఒక అసిస్టెంట్ మాత్రమే ఉంటుందని పనిష్‌మెంట్‌ని ఇచ్చారు. తర్వాత సమంతతో సెల్ఫీ దిగి బిగ్ బాస్ హౌస్‌కి బై బై చెప్పేసింది దివి. స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టిన కార్తీకేయని దివిని స్టేజ్ మీదికి తీసుకురావాలని కోరింది సమంత.

ఇక స్టేజ్ మీదికి వచ్చిన తరువాత కార్తికేయ వరుస సినిమాలు చేస్తున్నావ్ కదా.. నీ సినిమాలో దివికి ఛాన్స్ ఇవ్వాలని కోరింది సమంత. దీంతో తప్పకుండా.. దివి ఓకే అంటే నా సినిమా ఛాన్స్ ఇస్తా అని అభయం ఇచ్చాడు కార్తికేయ. దీంతో దివి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.