హోల్డర్‌ దెబ్బకు శాంసన్‌ అవుట్‌..

168
rr
- Advertisement -

ఐపీఎల్-13లో గురువారం మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ మూడో వికెట్ కోల్పోయింది. హోల్డర్‌ వేసిన 12వ ఓవర్లో సంజు శాంసన్‌(36) బౌల్డ్‌ కాగా.. రషీద్‌ ఖాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే బెన్‌ స్టోక్స్‌(30) కూడా బౌల్డ్‌ అయ్యాడు. వీరిద్దరూ 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కీలక సమయంలో హైదరాబాద్‌ బౌలర్లు‌ జోడీని పెవిలియన్‌ పంపి స్కోరు వేగానికి బ్రేక్‌ వేశారు. 16 ఓవర్లకు రాజస్థాన్‌ 4 వికెట్లకు 115 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, షాబాజ్ నదీమ్.

రాజస్థాన్‌ రాయల్స్‌: బెన్ స్టోక్స్, రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్ (wc), స్టీవెన్ స్మిత్ (c), జోస్ బట్లర్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగ్

- Advertisement -