- Advertisement -
కార్మికనేతగా, ఉద్యమ యోధుడిగా ఖ్యాతిపొందిన మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (80) మృతితో టీఆర్ఎస్ వర్గాల్లో విషాదం నెలకొంది. నాయినితో ఎంతో అనుబంధం ఉన్నవారు ఆయన కన్నుమూసిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు.
నాయినిని కడసారి చూసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నాయిని అంత్యక్రియల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం రాత్రి మృతిచెందారు.
- Advertisement -