దుబ్బాకను మరింత అభివృద్ధి చేస్తా: సోలిపేట సుజాత

84
solipet sujatha

దుబ్బాకను తన రామలింగారెడ్డి అభివృద్ధి పథంలో నడిపించాడని తనకు అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత. చేగుంట మండలం వల్లభపూర్, తాండ, నర్సంపల్లి, చిట్టోజిపల్లి, పొలంపల్లి, పోతన్ శెట్టి పల్లి గ్రామాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సుజాత….దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చానని…కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అన్నారు.