- Advertisement -
అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉన్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా దేవి హారిస్ చిక్కుల్లో పడ్డారు. దుర్గాదేవిగా కమలా మార్ఫింగ్ చిత్రాన్ని ఆమె మేనకోడలు ట్వీట్ చేయడంతో ఆమెపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రాన్ని పోస్ట్ చేసిన హారిస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా ఆ ట్వీట్‌ను మీనా హారిస్ తొలగించారు.
మీనా హారిస్ పోస్ట్ చేసిన చిత్రంలో దుర్గాదేవిగా కమలా హారిస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గేదె భూతం ‘మహిషాసుర’ గా చిత్రీకరించారు. డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినీ జో బిడెన్‌ను అమ్మవారి వాహనం సింహంగా చూపించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండటంతో ట్వీట్‌ని తొలగించి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు మీనా హారిస్.
- Advertisement -