బాలయ్య ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్..

276
Narthanasala
- Advertisement -

నట సింహ నందమూరి బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాల కిత్రం స్వీయ దర్శకత్వంలో ఆయన ‘నర్తనశాల’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. అయితే, ఆ చిత్రంలో ద్రౌపది పాత్రను పోషిస్తున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో… ఆ ప్రాజెక్టును బాలయ్య ఆపేశారు. బాలయ్యకు జానపద, పౌరాణిక చిత్రాలంటే మక్కువ ఎక్కువ. అయితే అప్పుడు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఈ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు బాలయ్య తీసుకొస్తున్నారు.

17 నిమిషాల చిత్రాన్ని ఈ నెల 24న ఎన్బీకే థియేటర్లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయనున్నట్టు బాలయ్య ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలయ్య అర్జునుడి పాత్రను పోషించగా, ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి నటించారు.

- Advertisement -