మొక్కలు నాటిన డిసిపి రోహిణి ప్రియదర్శిని..

661
DCP Rohini Priyadarshini
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బాలనగర్ డిసిపి పి వి పద్మజ రెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన డిసిపి క్రైం రోహిణి ప్రియదర్శిని ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్‌లో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. 2014లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజవంతమైందని, గత 6 సంవత్సరాలలో 5.8 శాతం అభివృద్ధి చెంది 29 శాతం చేరుకోవడం హరిత హారం యొక్క విజయంగా అభివర్ణచారు.

దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తూ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని అపూర్వ రావు ఎస్పీ వనపర్తి, సింధు శర్మ ఎస్పీ జగిత్యాల, రక్షిత కె మూర్తి డిసిపి మల్కాజిగిరి లకు ఛాలెంజ్ చేశారు.

- Advertisement -