గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రియాంక వర్గీస్ IFS..

215
Priyanka Verghese IFS

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు దూలపల్లిలో మొక్కలు నాటారు ముఖ్యమంత్రి కార్యాలయం OSD (హరిత హారం) ప్రియాంక వర్గీస్ (IFS).

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమం 23 శాతం నుండి 33 శాతానికి అడవులు పెంచాలన్న లక్ష్యంతో నడుస్తుంది అని.. తెలంగాణ రాష్ట్రం ఈ లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకుంటుందన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దీనికి తోడు అవుతుందని.. ఈ చాలెంజ్ వలన ప్రజలలో చైతన్యం కలుగుతుందని తెలిపారు.

మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలి అన్న బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నీతూ కుమారి ప్రసాద్ IAS కమిషనర్ కమర్షియల్ టాక్స్‌, క్రిస్టియాన IAS కార్యదర్శి గిరిజన సంక్షేమ శాఖ, టెస్సీ థామస్ DRDO బెంగళూరు (missile women of India)లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.