- Advertisement -
బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ (73) అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మల్లేశ్ మృతి పట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్‌తో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్(75) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని నారాయణగూడలోని మక్దూమ్ భవన్‌కు తరలించనున్నారు. అనంతరం అక్కడినుంచి బెల్లంపల్లికి తరలిస్తారు.
- Advertisement -