గుండా మల్లేష్ పట్ల మంత్రి కొప్పుల సతాపం..

185
minister koppula

బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ (73) అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మల్లేష్ అకాల మృతి పట్ల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సిపిఐ పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. మల్లేష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు.