బిగ్ బాస్ ఎపిసోడ్ 36…జోర్దార్ సుజాత ఎలిమినేట్

211
bigg boss 36
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 36 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి నుండి జోర్దార్ సుజాత ఎలిమినేట్ కాగా సండే ఫన్ డే జాలీగా ఇంటి సభ్యుల మధ్య జోష్‌తో ముగిసింది.

ఈవారం ఎలిమినేషన్‌లో మొత్తం 9 మంది ఉండగా.. వారిలో గంగవ్వ ఎలిమినేట్ అవుతూ అఖిల్‌ను సేవ్ చేసి వెళ్లిపోయింది. అలాగే సోహైల్ కూడా సేవ్ అయ్యాడు. మొత్తం మీద ఆదివారం నాటికి ఎలిమినేషన్ ప్రక్రియలో ఏడుగురు.. మోనాల్, అభిజీత్, అమ్మ రాజశేఖర్, జోర్దార్ సుజాత, లాస్య, నోయల్,అరియానా ఉన్నారు.

ఇక ముందుగా అదిరిపోయే పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగ్‌ మన టీవీ ద్వారా హౌజ్‌మేట్స్‌ను పలకరించారు. సన్ డే ఫన్ డేలో భాగంగా డంబ్ షెరాడ్స్ గేమ్ ఆడించారు. బౌల్‌లో కొన్ని చిట్టీలు పెట్టారు. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి ఒక చిట్టీ తీసి దానిలో ఉన్న సినిమా పేరు చదివి అలాగే కెమెరాకు చూపించి దాన్ని సైగలతో చేసి చూపించాలి…అలాగే ఆ సినిమా ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలన్నారు.

ఈ గేమ్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎవరికి సూట్ అవుతుందని నాగ్ అడగగా అంతా అభిజిత్ పేరు చెప్పారు. దీంతో అభిజిత్‌తో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్ వేసింది అరియానా. తర్వాత అర్జున్ రెడ్డిగా అఖిల్,పెదరాయుడుగా లాస్య,ఫిదాగా హారిక ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సినిమా పేరు సెట్ అయ్యేలా చేసి ఆధ్యంతం ఫన్నీగా సాగింది.

ఈ గేమ్ పూర్తయిన తరవాత హౌజ్‌లో ఉన్న గెస్ట్స్, స్టాఫ్‌లను నాగార్జున తారుమారు చేశారు. గెస్ట్‌లపై పగ, ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్‌ను స్టాఫ్‌కు ఇచ్చారు. దీంతో దేత్తడి హారిక, అరియానా, సోహైల్, మెహబూబ్‌పై స్టాఫ్ పగతీర్చుకున్నారు. అమ్మ రాజశేఖర్‌కు చేసినట్టు దేత్తడి హారికతో నుదిటిపై గాజు గ్లాసు, అందులో నీళ్లుపోసి నడిపించారు. తలలేని కోడి మాదిరిగా పరిగెత్తమని సోహైల్‌కు అవినాష్‌ను నిలబడాలని అరియానాకు జోర్దార్ సుజాతను ఎత్తుకుని 50 గుంజీళ్లు తీశాడు మెహబూబ్‌.

ఇక టాస్క్‌లు కంటిన్యూ అవుతుండగానే ఒక్కొక్కరూ ఎలిమినేషన్ నుండి సేవ్ అవుతూ రాగా చివరగా అమ్మ రాజశేఖర్,జోర్దార్ సుజాత మిగిలారు. వీరికి ఐస్ బార్ పగలగొట్టే టాస్క్‌ ఇచ్చి అందులో ఫోటో వచ్చిన వ్యక్తి ఎలిమినేట్ అవుతారని చెప్పగా దానిపై సుజాత పేరు రావడంతో ఆమె ఈ వారం ఎలిమినేట్ అయింది.

హౌస్‌ నుండి బయటకు వచ్చిన సుజాత…. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదని నాగార్జునకు చెప్పింది. అనుకోనిది జరిగితేనే బిగ్ బాస్ హౌజ్ కదా అంటూ తెలిపింది. ఇక సుజాత వెళ్లిపోతూ బిగ్ బాంబ్‌ను కెప్టెన్ సోహైల్ మీద వేసింది. ఈవారం మొత్తం హౌజ్‌లోని గిన్నెలన్నీ సోహైలే తోమాలని నవ్వుతూ చెప్పగా శణార్థులు అంటూ ఇంటి సభ్యులు సుజాతను సాగనంపారు. ఈ వారం గంగవ్వ,సుజాత ఇద్దరు బయటకు రావడంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది ఉన్నారు.

- Advertisement -