ఢిల్లీపై ముంబై ఘన విజయం…

165
decock
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. ఢిల్లీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది ముంబై.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుబెబ్బ తగిలింది. రోహిత్ శర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరుగగా మరో ఓపెనర్ క్వింటన్ డికాక్‌,సూర్య కుమార్ యాదవ్ ధాటిగా ఆడారు. ముఖ్యంగా డికాక్ విశ్వరూపం చూపిస్తూ హాఫ్ సెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 3 సిక్స్‌లు,4 ఫోర్లతో 53 పరుగులు చేసి రాణించాడు.డికాక్‌కి తోడుగా సూర్యకుమార్ యాదవ్‌ కూడా 32బంతుల్లో 53 పరుగులు చేసి రాణించడంతో ముంబై విజయం ఖాయమైంది. చివరలో హార్దిక్ పాండ్యా డకౌట్‌గా వెనుదిరిగిన ఇషాన్ కిషాన్ 28,పొలార్డ్ 11,కృనాల్ పాండ్యా 12 మిగితా పనిని పూర్తిచేశారు.

అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్:‌ 52 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌ ) హాఫ్‌ సెంచరీతో రాణించగా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(42: 33బంతుల్లో 5ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆధ్యంతం ధావన్ చక్కని షాట్లతో అలరించగా ముంబై బౌలర్లు సత్తాచాటడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది ముంబై. ముంబై బౌలర్లలో కృనాల్‌ పాండ్య(2/26), ట్రెంట్‌ బౌల్ట్‌(1/36)రాణించారు.

- Advertisement -