దుబ్బాకలో టీఆర్ఎస్ నుండి వలసల పర్వం కొనసాగుతోంది. రోజు వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతుండగా తాజాగా ఆనాజ్‌పూర్,తిమ్మక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ కార్యక్తలు పెద్ద ఎత్తున మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు…యువకులే టీఆర్ఎస్ పార్టీ సైనికులు అని తెలిపారు. విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని వెల్లడించారు.ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. జాబ్ మేళాలు నిర్వహించి ప్రయివేట్ ఉద్యోగాలను వారి కళ్ళ ముందుకే తెచ్చామన్నారు.
యువతను ఆకర్షించేలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాయమాటలు చెబుతున్న విషయాన్ని గ్రహించి పని చేసే పార్టీ వైపు వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు. యువతకు ఏ అవసరం వచ్చినా ఈ ప్రాంతంలో నేను, రామలింగన్న అండగా నిలబడ్డామని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు హరీష్ రావు.