- Advertisement -
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కామారెడ్డి, బోధన్ లో పర్యటించారు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత. మొదట కామారెడ్డి లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు.
అనంతరం, కల్వకుంట్ల కవిత బోధన్ చేరుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తో కలిసి బోధన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు.
- Advertisement -