ఐపీఎల్ 2020లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. 10 పరుగుల తేడాతో ఓడిపోగా ఈ ఓటమిలో ప్రధాన కారణం కేదార్ జాదవ్. 12 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన జాదవ్ చెన్నై ఓటమికి కారణమయ్యాడు.
జాదవ్ బ్యాటింగ్ చూసిన నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది. 21 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన క్రమంలో క్రీజులోకి వచ్చిన జాదవ్ చెత్త బ్యాటింగ్‌తో నిరాశపర్చారు. ఓ వైపు జడేజా 8 బంతుల్లో 21 పరుగులు చేయగా జాదవ్ కాస్త ధాటిగా ఆడి ఉంటే గెలుపు చెన్నైదేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
ఇక పేలవ ఫామ్‌తో ఉన్నప్పటికీ కేదార్ జాదవ్‌ని టీమ్‌లో కొనసాగిస్తున్న కెప్టెన్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి తర్వాతి మ్యాచ్‌లోనైనా జాదవ్‌ను తప్పించి అతని స్ధానంలో వేరే ఆటగాడిని తీసుకుంటారా లేదా వేచిచూడాలి.