ప్రజల్లో భరోసా నింపుతున్న వైద్య ఆరోగ్య శాఖ: కేటీఆర్

145
ktr

మంత్రి ఈటల రాజేందర్ నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్లో భరోసా నింపుతుందన్నారు మంత్రి కేటీఆర్. గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పని చేసిందని తెలిపారు.ఈసారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయని…ఇందుకు పంచాయతీ రాజ్ మరియు మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ తో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగిందని…ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో అదుపులో ఉందని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కొవిడ్ సందర్భంగా ఏర్పడిందన్నారు. రానున్న కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింతగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం నుంచి మొదలుకొని ఐసీయూ యూనిట్‌, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను నిర్వహించిందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో పాత్ర వహించిన ఆశా వర్కర్ నుంచి శాఖాధిపతి హెల్త్ సెక్రటరీ వరకు అందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.