తెలంగాణకు నీళ్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరారు:గజేంద్రసింగ్

442
gajendrasingh shekavath
- Advertisement -

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో జల వివాదాలపై తమ అభ్యంతరాలను అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచాయి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌…విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు జరిగిందన్నారు.సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపర అంశాలు పరిశీలిస్తాం…కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్రం త్వరలో నిర్ణయిస్తుందన్నారు.

చట్టం ప్రకారం కృష్ణ బోర్డ్ ఏర్పాటైంది….నదీజలాల సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు జరిగింది…నాలుగు ప్రధాన అంశాలపై ఇవాళ జరిగిన సమావేశంలో చర్చించాం అన్నారు. రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై కూడా చర్చ జరిగింది….ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనలు విన్నాం….ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణకు నీళ్లు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారని తెలిపారు.

అవసరమైతే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును విత్ డ్రా చేసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు…ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డిపిఆర్ లను సమర్పించాలని కోరినం…డిపిఆర్ లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖత తెలియజేశారని వెల్లడించారు. కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్ కు ఉంది…కృష్ణ నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడానికి ఇరు రాష్ట్రాల అంగీకరించాయని వెల్లడించారు.

- Advertisement -