రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వరంగల్ సిఎఫ్ఓ అక్బర్ ఖాన్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి, గాంధీ జయంతి సందర్బంగా మహాదేవపూర్ డిఎఫ్ఓ వజ్రా రెడ్డి భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దూర దృష్టితో చేపట్టిన హరితహారం భవిష్యత్ తరాలకు పచ్చని బంగారు బాట. చక్కటి ఆక్సిజన్ కోసం, ఇప్పుడు పచ్చదనం కోసం హరితహారం చేపట్టారు దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం వాటిని కాపాడే బాధ్యత, పర్యావరణ పరిరక్షణకి తీసుకుంటున్న చొరవ అభినందనీయం.
ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని వారు ఈ ఛాలెంజ్ ని భూపాలపల్లి ఎఫ్ఆర్ఓ రేణుక, సెల్పూర్ ఎఫ్ఆర్ఓ నాగరాజు, మహాదేవపూర్ ఎఫ్ ఆర్ ఓ కమల కి ఛాలెంజ్ చేశారు.