ధోనీ మరో అరుదైన ఘనత..

120
MS Dhoni

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మరో రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఈ రోజు రాత్రి చెన్నై, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ధోనికి 194వ ఐపీఎల్‌ మ్యాచ్‌. ఇప్పటి వరకు ధోనీ ఐపీఎల్‌లో 193 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ధోనీ, సురేశ్‌ రైనా 193 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ధోనీ ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను సాధించనున్నాడు. కాగా రైనా ఐపీఎల్‌-13వ సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రికార్డు ధోనీ సోంతం కానుంది.