- Advertisement -
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదుచేసుకోవాలని జగదీష్ రెడ్డి తెలిపారు.
కేటీఆర్ పిలుపు మేరకు సూర్యపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని మండల రెవిన్యూ కార్యాలయంలో తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డితో సహా ఓటును నమోదు చేసుకున్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీతో సమానమైన మూడు సంవత్సరాల విద్యను అభ్యసించిన వారందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్‌గా ఓటు హక్కు నమోదుచేసుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
- Advertisement -