చేనేతకు చేయూత…కేటీఆర్ బాటలో పవన్‌

267
- Advertisement -

చేనేత రంగానికి పూర్వ వైభవం తేవడమే రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న కృషి ఫలిస్తోంది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా తానే నేతన్నకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని ప్రకటించి…అందరికీ స్పూర్తిగా నిలిచారు. కేటీఆర్ స్పూర్తితో మొదలైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. సినీ నటుల దగ్గరి నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరు చేనేతకు చేయూత నందించేందుకు ముందుకొస్తున్నారు.

Pawan with KTR

ఇప్పటికే నాగార్జున సహా కమల్ హాసన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు స్పందించగా తాజాగా జనసేన అధినేత పవన్ సైతం స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చేనేత కుటుంబాల జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు చేనేతకు ప్రచారకర్త (బ్రాండ్‌ అంబాసిడర్‌)గా ఉంటానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. చేనేత అనేది జాతి సంపదని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Pawan with KTR

ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదికల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌ని కలిశారు. రెండు రాష్ట్రాల్లో సంభవిస్తున్న నేత కార్మికుల ఆకలి చావులు, తమ కష్టాలను వివరించారు. వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న ‘చేనేత సత్యాగ్రహం’ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

Pawan with KTR

ఇక రాష్ట్రంలో ప్రతి మండేను హ్యాండ్లూం డేగా మార్చిన కేటీఆర్‌….ప్రభుత్వ ఉద్యోగులందరూ చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు. దీంతో కలెక్టర్‌ స్ధాయి అధికారుల నుంచి కింది స్ధాయి అధికారుల వరకు ఇదే పద్దతిని ఫాలో అవుతు నేతన్నకు సాయంగా నిలుస్తున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. వీఐపీలతో పాటు ప్రజలు సైతం చేనేతకు చేయూత కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.

Pawan with KTR

- Advertisement -