హైదరాబాద్‌ @ మోస్ట్ డైనమిక్ సిటీ

145
Hyderabad fifth most dynamic city

అభివృద్ధి పథంలో జోరుగా దూసుకెళుతున్న హైదరాబాద్‌ నగర కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల (డైనమిక్‌) నగరాల్లో ఐదో స్థానాన్ని భాగ్య నగరం దక్కించుకుంది. జీవించడానికి అనుకూల పరిస్థితులు, ఎయిర్ కనెక్టివిటీ, విద్యావ్యవస్థ సామర్థ్యం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా వాల్డ్ ఎకానమిక్ ఫోరం ఈ ర్యాంకులు కేటాయించింది. జీవన ఆర్థిక పరిస్థితుల ఆధారంగా 40 పాయింట్లు, రియల్ ఎస్టేట్ సంబంధింత రంగాల ఆధారంగా 30 పాయింట్లు కేటాయించారు. ఇందులో బెంగళూరు మొదటిస్థానంలో నిలవగా… లండన్, ఆస్టిన్, బోస్టన్ లను వెనక్కి నెట్టి హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచింది.

ప్రపంచ ప్రగతిశీల నగరాల్లో హైదరాబాద్‌కు ఐదో స్థానం స్థానం దక్కడంపై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తంచేశారు. మరింత అభివృద్ధి చెందేందుకు హైదరాబాద్‌కు అవకాశం ఉందన్నారు. మన దేశానికి చెంది న బెంగళూరుకు అగ్రస్థానం దక్కడం ఆనందదాయకమని అన్నారు.

మొదటి స్ధానంలో బెంగళూరు నిలవగా రెండో స్థానంలో వియత్నాంలోని హోచిమిన్ సిటీ,మూడో స్థానంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నాలుగో స్థానంలో చైనాలోని షాంఘై నిలిచాయి. లండన్ (బ్రిటన్), హనోయ్ (వియత్నాం), ఆస్టిన్ (అమెరికా), బోస్టన్ (అమెరికా), నైరోబీ (కెన్యా) తదుపరి స్థానాలు పొందాయి.

జనాభా, కనెక్టివిటీ, టెక్నాలజీ, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, విద్య, ఆర్థిక ఫలితాలు, కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఆస్తుల విలువ వంటి 42 అంశాలను ఆధారం చేసుకుని జేఎల్‌ఎల్ కన్సల్టెన్సీ తన వార్షిక నగరాల పురోగతి సూచిక (సీఎంఐ)ను విడుదల చేసింది.

Hyderabad fifth most dynamic city

రెండున్నరేండ్ల నుంచి హైదరాబాద్‌ను వివిధ రంగాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని…ఆ కృషికి ఫలితమే అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందడానికి కారణమైందని అధికారులు తెలిపారు. టీఎస్-ఐపాస్ వంటి విప్లవాత్మకమైన విధానాలు, పాలనా సంస్కరణలు, దేశ, విదేశీ పెట్టుబడులను నగరానికి రప్పించడానికి ప్రభుత్వం కృషి అభినందనీయమని వెల్లడించారు.

ప్రస్తుతం మొత్తం ప్రపంచ జనాభాలో సగభాగం నగరాల్లోనే నివసిస్తున్నదని, పట్టణీకరణ విశేషంగా పెరుగుతున్నదని పేర్కొన్న నివేదిక.. ఈ నేపథ్యంలో నగరాలు విజయవంతం కావడం గొప్ప ఆవశ్యకంగా మారిందని తెలిపింది. ఈ జాబితాలో లండన్, షాంఘై, సిలికాన్ వ్యాలీ నగరాలు మాత్రమే 2014 నుంచి టాప్ టెన్‌లో కొనసాగుతున్నాయి. మొత్తం 134 నగరాలు, మెట్రోపాలిటన్ ప్రాంతాలను 42 అంశాల ప్రాతిపదికగా పరిశీలించారు. ఈ సారి టాప్ 30లో ఆసియా-పసిఫిక్ దేశాలు అధిక సంఖ్యలో చోటు సంపాదించడం విశేషం.