ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరు….!

105
Chiranjeevi to be AP's CM candidate in 2019

మెగాస్టార్‌ ఇన్నిరోజులు సినీ రంగానికి దూరంగా ఉన్న లోటు ఖైదీ నెంబర్‌150తో తీర్చేశాడు. గతం తొమ్మిదిసంవత్సరాలుగా రాజకీయల్లో గడిపిన చిరు కాస్త రిలాక్స్‌ తీసుకుని ఖైదీ సినిమాతో బాక్స్‌ఫీస్‌ బద్దలు కొట్టాడు. అయితే టాలీవుడ్‌లో మెగాస్టార్‌ ముందు ముందు సినిమాలు చేస్తారా లేక రాజకీయల్లో క్రియశీల పాత్రపోషిస్తార అనేదిపై క్లారిటీ లేదు. చిరు సన్నిహితులు మాత్రం ఇటు సినిమాల తో పాటు రాజకీయాల్లో కూడా తన వంతు పాత్ర వహిస్తారని చెబుతున్నారు.

AP CM Megastar Chiranjeevi

అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి త్వరలోనే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయట. వచ్చేఎన్నికల్లో చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్‌ అధినాయకత్వం సుముఖగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌కు త్వరలోనే ఓ కీలక బాధ్యత అప్పగించబోతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా చిరును నియమించ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఈనెల 18న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం.

AP CM Megastar Chiranjeevi

ఎంజీఆర్ జయంతి నేపథ్యంలో తమిళనాట మాత్రం ఈనెల 20న ఆందోళనలు జరుగుతాయట. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరవుతారని.. తమిళ నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని…. ఆ సందర్భంగానే చిరు పదవి గురించి కూడా క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇటీవలే చిరు.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఈ విషయమై గురించే మాట్లాడినట్లు తెలుస్తోంది.

AP CM Megastar Chiranjeevi

ఇటీవలే ఓ ఇంటర్వుల్లో రాజకీయాల ప్రస్తావన తెస్తే తనకు ఏ మాత్రం ఆసక్తి లేనట్లు చెప్పాడు చిరంజీవి. రాజకీయాల్లో అంటిముట్టన్నట్లుగా వ్యవహారిస్తున్నట్లు వ్యాఖ్యలు చేయడంతో పాటు 2019 ఏపీ ఎన్నికల్లో తన పాత్ర ఏమీ ఉండదని అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం ఈ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. చిరంజీవి రాబోయే రోజుల్లో రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహారించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

AP CM Megastar Chiranjeevi

చిరు 150వ సినిమాకు ముందు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిసి 150 సినిమా కథ వినిపించాడని…అప్పుడు సోనియా గాంధీ రాబోయే రోజుల్లో ఎలక్షన్స్‌కు ఉపయోగపడే స్కిప్ట్‌ను సెలక్ట్‌ చేసుకొమని చిరుకు సోనియా సలహా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.