- Advertisement -
భగత్ సింగ్ 113వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. భగత్‌సింగ్ భారతీయులందరికీ స్ఫూర్తి అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తన విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్తమార్గం చూపారు. దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసి యువతలో స్ఫూర్తి నింపిన గొప్ప వీరుడు. ఆయన స్ఫూర్తిని భారత జాతి నిరంతరం గుర్తు చేసుకుంటుందదని కొనియాడారు.
1907లో ఫైసలాబాద్ జిల్లాలోని బంగా గ్రామం( ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోగల ల్యాల్‌పూర్)లో భగత్‌సింగ్ జన్మించారు. స్వాతంత్య్ర ఉద్యోమంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన భగత్ సింగ్‌ను 1931 మార్చి 23న లాహోర్ జైలులో ఉరితీశారు.
- Advertisement -