24 గంటల్లో 1378 కరోనా కేసులు..

112
corona

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1378 కరోనా కేసులు నమోదుకాగా 7 మంది మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,87,211కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 29,673 యాక్టివ్ కేసులుండగా 1,56,431 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో 1107 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసిలో 254, కరీంనగర్ లో 78, రంగారెడ్డిలో 110 కేసులు నమోదయ్యాయి.