తడి, పొడి చెత్త వాహనాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

195
puvvada
- Advertisement -

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా తడి, పొడి చెత్తను నివాసాల నుండి సేకరించేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన 30 వాహనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.ఇప్పటికే నగరంలో 20 అందుబాటులో ఉండగా నూతనంగా మరో 30 ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి డివిజన్‌కు ఒక వాహనం కేటాయించి ప్రతిరోజు చెత్తను సేకరించి ఆయా చెత్తను స్వయం సహాయక సంఘాల ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసి వారికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఒక్కో వాహనం రూ.5.24 లక్షలు కాగా మొత్తం రూ.1.57 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు.

అలాగే పురపాలక శాఖ మంత్రి సూచనల మేరకు ఖమ్మంలో 30,31,47వ డివిజన్లలో నూతనంగా నిర్మించిన మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభించారు. ప్రజలకు సరిపడ టాయిలెట్స్ నిర్మిస్తున్నాం. ఇప్పటికే అనేక డివిజన్లలో ప్రారంభించామని మంత్రి పువ్వాడ తెలిపారు.

- Advertisement -