ఎన్‌సీబీ విచారణకు హజరైన శ్రద్ధాకపూర్..

108
Shraddha Kapoor

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతున్న అధికారులకు సినీ పరిశ్రమలో‌ని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలయడంతో దీనిపై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకొనే ఈ రోజు ఉదయం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారుల ముందు విచారణకు హాజరైంది. ఆమె నుంచి అధికారులు పలు వివరాలను రాబట్టారు. ఆమె ఫోనును అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది.

డ్రగ్స్‌ కేసులో దీపికతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి శ్రద్ధాకపూర్ వచ్చింది. శ్రద్దాని బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. విచారణలో వీరు ఎలాంటి సంచలన విషయాలని బయటపెడతారు అన్నది ఆసక్తిగా మారింది.