అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

182
ambulences
- Advertisement -

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ఇంద్రకరణ్‌ రెడ్డి 3 అంబులెన్స్ లను, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ -2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్ రావు-1 అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్యెల్యే దివాక‌ర్ రావు అంద‌జేసిన కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు కేటీఆర్. అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకు ప్రభుత్వానికి అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా కరోనా బాధితుల కోసం ఈ అంబులెన్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చామని నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని క‌లెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో ఈ అంబులెన్స్ ల‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

- Advertisement -