కోవిడ్ 19 దృష్ట్యా, కరోన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న బధిర మరియు అంధ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల ద్వారా క్లాసులు వినుటకు బోదించుటకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 8,9,10తరగతుల మూగ, చెవిటి, విద్యార్థులకు 4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ పంపిణీ చేశారు వికలాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి.సంస్థ ఎండి శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యంగులకు ఆసరా పథకం ద్వారా గతంలో 1500/-రూ. ఉన్న పెన్షన్ 3016/- చేసారని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించినట్లే దివ్యంగులకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఈ రోజు వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బదిరులకు 4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ అందిచడం జరిగింది అని.. త్వరలో కార్పొరేషన్ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందజేస్తామని తెలియజేసారు.
అనంతరం కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసున్న నాయకుడు కాబట్టే దివ్యంగుల సంక్షేమనికి అనేక నిధులను, కేటాయించి, ఆడుకుంటున్న గొప్ప నాయకుడని, దివ్యంగుల సంక్షేమంలో దేశంలోనే నె.1 రాష్ట్రంగా తెలంగాణ ఉందని, కరోన సమయంలో కూడా దివ్యంగులకు ఇచ్చే పెన్షన్లు అపకుండ ప్రతి నెల రూ.3016/- చొప్పున నెలకు దాదాపు 5లక్షల మందికి రూ.150 కోట్లు,ప్రతి సం.రము దాదాపు 1800 కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం, నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే అని అన్నారు.
ఈ రోజు వికలాంగుల శాఖ ద్వారా నడుపుతున్న 5 ఆశ్రమ పాఠశాలలో 8,9,10 తరగతుల చదువుతున్న బదిరులకు వీడియో,ఆడియో, సైన్ బాషా ద్వారా తరగతుల బోధన కోసం 4జి స్మార్ట్ సెల్ ఫోన్స్ ను వికలాంగుల సహకార సంస్థ ద్వారా మంత్రి చేతుల మీదుగా కొంది మంది బదిరుల విద్యార్ధులకు అందిచడం జరిగిందని, కరోన నేపథ్యంలో ఆన్ లైన్ బోధన కోసం మాత్రమే ఉపయోగించాలని,తల్లి తండ్రుల సమక్షంలో వీటిని వినియోగించాలని సూచిస్తూ, మిగత 250 మంది విద్యార్థులకు వారి స్కూల్ ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రుల సమక్షంలో అందిచడం జరుగుతుందని చెప్పారు.త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అన్ని వర్గాల దివ్యంగులకు సహకార సంస్థ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు అందించబోతున్నామని చెప్పారు.