చిరంజీవి 150వ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150ని చూశాను. నా భార్య మెలినియా,కుమార్తె ఇవాంకాతో కలిసి సినిమాను ఎంజాయ్ చేశా. బ్యాస్ ఈజ్ బ్యాక్ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించాడు. చిరంజీవి గొప్ప మనిషి అతనితో ఇప్పుడే ఫోన్ల్ మాట్లాడాను అంటూ కూడా ట్వీట్ చేశాడు.
అయితే ఇదంత నిజమే అనుకుంటున్నార మీరు పొరపడినట్లే ట్రంప్ చిరంజీవికి ఫోన్ చేయలేదు. ఓ నెటిజన్ క్రియేట్ చేసిన ఫేక్ ట్రంప్ ట్వీట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది. అయితే ట్రంప్ నిజంగానే ఫోన్ చేసి, మెగాస్టార్‌ను అభినందించారేమో అని భ్రమపడి.. ఆ ట్వీట్‌ను షేర్ కూడా చేస్తున్నారు మెగాస్టార్ అభిమానులు. మెగాస్టార్‌పై ఇంత అభిమానం ఉంటే ఫ్యాన్స్ ఈవిధంగా ఫెక్ ట్వీట్ట్‌లు పోస్ట్ చేసి పాపులారీటి పొందతున్నారని కామెంట్ల్ విసురుతున్నారు నెటిజన్లు. ఇది చూసిన పలువురు సినీ పండితులు సోషల్ మీడియాలో ఇద్దరు అగ్రహీరోల ఫ్యాన్స్ మధ్య భారీగానే యుద్ధం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు.
ఈసోర్టీ ఇలా ఉంటే సోషల్ మీడియాపై రాను రాను నమ్మకం తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిన్నటికి నిన్న త్రిష మరణించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు సృష్టించారు నెటిజన్లు. సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యమైనదని అవసరమైన వాటికి దాని ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని…ఫెక్ వార్తలు సృష్టించి ప్రజల్లో అపనమ్మకం కల్పిస్తున్నారని కొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.