- Advertisement -
రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట పర్యాటక అభివృద్ధిపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్…..ప‌్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణలో టూరిజంను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని … జలవనరులు ఉన్న ప్రాంతాలన్నింటినీ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వరంగల్‌లో కాళోజీ ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో మంచి టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యాదాద్రిలో కూడా అద్భుతమైన టూరిజంను ఏర్పాటు చేసి అందరినీ ఆకర్షించేలా చేస్తామన్నారు.
- Advertisement -