గుండు గెటప్‌పై చిరు క్లారిటీ..

432
chiru

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గుండు అవతారంలో కనిపించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అయితే ఆయన నిజంగానే గుండు చేయించుకున్నారా? లేక త‌న తదుపరి సినిమా ప్రాజెక్టు కోసం ఫొటోషూట్ లో పాల్గొన్నారా? అన్న ప్రశ్నలకు తెరపడింది. అభిమానుల సందేహాలన్నింటికి చిరు క్లారిటీ ఇచ్చారు.

తాజాగా మెగాస్టార్‌ ‘మేకింగ్‌ ఆఫ్ అర్బన్‌ మాంక్‌’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. తనతలపై వెంట్రుకలు మాయమై, గుండు ఎలా ప్రత్యక్షమయ్యిందో ఈ వీడియో ద్వారా తెలిపారు. ఆయన నిజంగా గుండు చేయించుకోలేదని, ఫొటోషూట్ లో భాగంగానే మేకప్ మాయతో గుండు గెటప్‌ వేయించుకున్నారని దీని ద్వారా తెలిపోయింది.

కాగా చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతున్న ఆచార్య లో న‌టిస్తున్నాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్..క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షురూ కానుంది. మ‌రోవైపు చిరంజీవి లూసిఫ‌ర్, వేదాళ‌మ్ రీమేక్ లలో న‌టించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.