మొక్కలు నాటిన కరీంనగర్ డీసీఎంఎస్‌ చైర్మన్..

229
Srikanth Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీ.సీ.ఎం.ఎస్‌ చైర్మన్ అల్లాల శ్రీకాంత్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -