గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జబర్దస్త్ బాబీ..

184
Jabardasth Actor Baby

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు యూసుఫ్ గూడలో మొక్కలు నాటారు జబర్దస్త్ బాబీ. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని జబర్దస్త్ బాబీ అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని… జబర్దస్త్ పంచ్ ప్రసాద్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ యూసుఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ స్టేడియంలో మూడు మొక్కలు నాటారు జబర్దస్త్ బాబీ..కాగా మరో ముగ్గురు ( జబర్దస్త్ నటులు దొరబాబు , శాంతి స్వరూప్ , అశోక్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.