సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులు పరిశీలించనున్నారు…సీఎం కేసీఆర్ యాదాద్రి రానున్న నేపధ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారుఅధికారులు….ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకోనున్న సీఎం కేసీఆర్ భలాలయంలో మొదటగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు…అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణం మరియు దేవస్థానం అభివృద్ధి పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కొండపైన హరిత టూరిజం హోటల్ లో వైటిడిఏ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఇప్పటి వరకు జరిగిన పనుల సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకొనున్నారు సీఎం కేసీఆర్.
సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు..స్వామి వారి దర్శనంతరం ప్రధానాలయం,ప్రెసిడెన్షియల్ సూట్ పనులు,రింగ్ రోడ్డు పనులు పరిశీలిస్తారనే సమాచారంతో అన్ని ప్రాంతాల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు..మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.. ముఖ్యంగా సీఎం పర్యటించే ఏరియాను బాంబ్ స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేక తనిఖీ చేస్తున్నారు…
యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునర్నిర్మిస్తుంది.దాదాపు రెండు వేల కోట్లతో పనుల నిర్మాణం చేపడుతోంది….దాదాపు చివరి దశకు చేరుకున్నాయి ప్రధానాలయం పునర్నిర్మాణం పనులు మిగితా పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు అధికారులు… గత ఏడాది డిసెంబర్ లో యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ ఇప్పడు మరోసారి యాదాద్రి కి వస్తున్నారు…మధ్యలో ఆలయ నిర్మాణం పనులు పరిశీలించాలనుకున్నారు..అయితే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు…సీఎం కేసీఆర్ యాదాద్రి అభివృద్ధి పనులు పరిశీలించి ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని తెలుసుకొనున్న నేపధ్యంలో ఇందుకు సంబంధించిన ఒక నివేదిక రూపంలో సీఎం కేసీఆర్ ముందు ఉంచనున్నారు వైటీడీఏ అధికారులు….సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకొని పలు అధికారులకు పలు సూచనలు చేయనున్నట్టు సమాచారం.