తెలంగాణలో వెయ్యికి చేరువలో కరోనా మరణాలు..

124
coronavirus

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో రాష్ట్రంలో 2,216 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,57,096కి చేరగా ఇప్పటికీ 961 మంది మృత్యువాతపడ్డారు. 1,24,528 మంది కరోనా నుండి కోలుకోగా 31,607 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 341, రంగారెడ్డి 210, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 148, నల్గొండ 126, కరీంనగర్‌ 119, ఖమ్మం 105, వరంగల్‌ అర్బన్‌ 102 అత్యధికంగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.