కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మేలు: అక్బరుద్దీన్

177
owaisi
- Advertisement -

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓ వైసీ. కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ…ఎంఐఎం పార్టీ బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తుందన్నారు.

భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌ల్పించేందుకు కొత్త రెవెన్యూ చ‌ట్టం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఆల‌యాలు, ద‌ర్గా, వ‌క్ఫ్ భూముల‌ను ఇత‌రుల‌కు రిజిస్ర్టేష‌న్లు చేయొద్దు అని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆక్ర‌మ‌ణ‌కు గురైన వ‌క్ఫ్ భూముల‌ను కాపాడాల‌ని ఓవైసీ కోరారు.

స్వాతంత్ర్యం వ‌చ్చాక చాలా మంది భూములు పోయాయి. భూములు పోగొట్టుకున్న వారిలో అధికులు ముస్లింలే ఉన్నార‌ని గుర్తు చేశారు.స్ల‌మ్ ఏరియాల్లో లే అవుట్‌లు లేవు. స్ల‌మ్ ఏరియాల‌ను నోట‌రీ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. స్ల‌మ్ ఏరియాల్లో పేద‌లు రేకుల షెడ్లు, చిన్న గృహాలు నిర్మించుకున్నారు వారి భూముల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు.

- Advertisement -