సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం..

150
cm jagan

ఏపీ సీఎం జగన్ ఆడపడుచుల కోసం మరో పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. పీఅండ్‌జీ, హెచ్‌యూఎల్‌ లాంటి మల్టీనేషనల్‌ కంపెనీల ద్వారా మహిళలకు చేయూతనిస్తాం. పసిపిల్లల నుంచి అవ్వల వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ఈ పథకం కింద 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనున్నది. తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈరోజు జమ చేశారు. బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని సీఎం స్పష్టం చేశారు. ఏపీలోని ప్రతి ఇంటిలో ఉండేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్‌ తెలిపారు.