- Advertisement -
బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగిన దేశీయ మార్కెట్‌లలో మాత్రం తగ్గుముఖం పట్టాయి.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.680 తగ్గి రూ.48,860కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.53,290కి చేరింది.
బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.450 పెరిగి రూ.67,050కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1940 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.82 శాతం పెరుగుదలతో 27.09 డాలర్లుగా ఉంది.
- Advertisement -